అల్ఫా ఒమేగ అయిన - మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా
తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుచుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగ నను చేసెను
నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే !!అల్ఫా ఒమేగ!!
సర్వ యుగములలొ సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా 1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా 2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణమును గెలిచిన బహుధీరుడా 3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ శతృవునణచిన బహుశూరుడా