సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య
సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు
సమృద్ది అయిన కృపతో నింపుము
నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము
ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై
నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు
అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో
సహనము కలిగించి నడుపుము నను తుది వరకు
కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు
ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది
గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా
మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్య
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.