సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య
సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు
సమృద్ది అయిన కృపతో నింపుము
నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము
ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై
నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు
అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో
సహనము కలిగించి నడుపుము నను తుది వరకు
కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు
ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది
గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా
మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్య
ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్దపరచుము
నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము
పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము
ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము
షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని
సుకుమారమైన వదనము నీది - స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా - నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా !!షారోను!!
సర్వొన్నతమైన రాజ్యము నీది - సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా - నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!
సాత్వికమైన పరిచర్యలు నీవి - సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా - ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!
నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను
అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
కలిగియుందునే - నీ దైవత్వమే !! నాలోన !!
ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే - నీ దీనత్వమే !! నాలోన !!
వివేక హృదయము - అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే - నీ ఆమరత్వమే !! నాలోన !!
యేసయ్య ! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!
నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !!
నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను !! యేసయ్య !!
నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును !! యేసయ్య !!
Andhra Kraistava Hymnal 'Jeevaharama Rammu' written by A.B.Masilamani.
Music: Ashish Masilamani Gollapalli
Vocals: Jeeva Ratnam Pakerla
Recorded at Acts 1n8 Studio, Farmington Hills, Michigan, USA
Mixed and Mastered at Shepherd's Virtual Sound Space, Southfield, Michigan, USA
సర్వ యుగములలొ సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా
1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా
3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము
" లెమ్ము "
శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొందుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత
" లెమ్ము "
తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము
" లెమ్ము "
---
lemmu taejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa !
ninnae smariMchukonuchu nee saakshigaa prakaaSiMchuchu
raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenOLLa prakaTiMcheda !
unnata pilupunu nirlakshyaparachaka neetO naDuchuTae naa bhaagyamu
SaaSvata praematO nanu praemiMchi nee kRpachoopitivi
idiyae bhaagyamu- idiyae bhaagyamu -idiyae naa bhaagyamu
" lemmu "
SramalalO nEnu iMtavarakunu neetO niluchuTae naa dhanyata
jeevakireeTamunae ponduTakae - nanu chaeradeesitivi
idiyae dhanyata - idiyae dhanyata - idiyae naa dhanyata
" lemmu "
taejOvaasula svaasthyamu naenu anubhaviMchuTae naa darSanamu
taejOmayamaina shaalaemu nagarulO - nityamu ninu choochi tariMtunae
idiyae darSanamu - idiyae darSanamu - idiyae naa darSanamu
" lemmu "
Tuesday, October 09, 2012
Bible Study, Biographies, contact us, Events, Hosanna Ministries, Magazines, Messages, Movies, Music Albums, Prayer Requests, Sermons, Video Albums, Videos, Wallpapers