***fallow updated ... కృపామయుడు మహోన్నతుడు సర్వోన్నతుడు ఆశ్చర్యకరుడు మహిమాస్వరూపుడు నా యేసురాజు నా స్తుతిపాత్రుడు నా నిరీక్షణ జ్యొతిర్మయుడు శ్రీమంతుడు మహనీయుడు సర్వాంగసుందరుడు పరాక్రమశాలి అనంతస్తొత్రార్హుడు స్తుతి ఆరాధన ప్రభు గీతారాధన ఆత్మానుబందం దయాకిరీటం కృపామృతం శాశ్వత కృప ఆరాధన పల్లకి స్తోత్రాంజలి యేసయ్య దివ్యతేజం***
Showing posts with label 2015. Show all posts
Showing posts with label 2015. Show all posts

Alpha Omega Hosanna Ministries 2015 Album Song Lyric.



అల్ఫా ఒమేగ అయిన - మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా
పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా

తేజోమయుడా నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుచుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగ నను చేసెను
నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే !!అల్ఫా ఒమేగ!!

నిజస్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా - నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీతోనేె - నా కలమి నీలోనేె !!అల్ఫా ఒమేగ!!

Telugu One Faith Visitors

Followers